బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అరవింద్ అన్నీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆయన మాటలు అత్యంత హేయంగా ఉంటాయన్నారు.యావరేజ్ గా ఎంపీలు 20 డిబేట్లలో పాల్గొంటే అరవింద్ మాత్రం నాలుగేళ్లలో 5 డిబేట్లలో మాత్రమే పాల్గొన్నారని తెలిపారు.
ఎంపీలు 150 ప్రశ్నలు అడిగితే అరవింద్ 65 ప్రశ్నలే అడిగారని చెప్పారు.ఆయన రాజస్థాన్ లోని ఫేక్ యూనివర్సిటీలో చదువుకున్నారని వెల్లడించారు.
దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని కవిత పేర్కొన్నారు.అరవింద్ కు ఎంపీగా ఉండే అర్హత లేదని విమర్శించారు.
అరవింద్ ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు.కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదన్న ఆమె.ఇంకోసారి తాను పార్టీ మారుతానంటూ మాట్లడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని వెల్లడించారు.







