బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam ) లో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని కవిత పిటిషన్ లో తెలిపారు.
కాగా కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీం( Supreme Court ) ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం కవితను ఈడీ రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది.
మరోవైపు కవిత భర్త అనిల్( Anil ) ను కూడా విచారించేందుకు ఈడీ సిద్ధమైందని సమాచారం.







