తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది.ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాల భర్తీకి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
మార్చి 29న ముగ్గురు ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు.నవీన్ రావు, గంగాధర్ గౌడ్ తో పాటు ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మార్చి 6వ తేదీ నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.ఉపసంహరణకు వచ్చే నెల 16 చివరి రోజు కాగా… మార్చి 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు.
సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.
అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఈ మూడు సీట్లు అధికార బీఆర్ఎస్ కే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.మహబూబ్ నగర్ -రంగారెడ్డి -హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది పోటీ చేయనున్నారు.
ఇందుకు మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.అటు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
మజ్లిస్ అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ గెలుపొందారు.