ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.
గ్రామంలో అభివృద్ధి ఏదంటూ స్థానికులు నిలదీశారు.కనీసం తమ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోలేదని మండిపడ్డారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బాలరాజు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసిన వినిపించుకోకపోవడంతో కార్యక్రమం నుంచి వెనుదిరిగారు.