బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ టార్గెట్ గానే ఈడీ తనకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు.
హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పారు.
బీజేపీ వెయ్యి పడగల పాములా వ్యవహరిస్తోందని విమర్శించారు.
అనంతరం బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.
సంజయ్ కు 24 గంటలు సమయం ఇస్తున్నానన్న ఆయన బెంగళూరు డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపించాలని తెలిపారు.డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని భాగ్యలక్ష్మీ అమ్మవారి ప్రమాణం వేసి చెప్పారు.
రేపు మళ్లీ అమ్మవారి ఆలయానికి వస్తానన్న రోహిత్ రెడ్డి బండి సంజయ్ కూడా రుజువులతో రావాలని ఛాలెంజ్ చేశారు.