హైదరాబాద్ లోని గోషామహల్ చాక్నవాడలో నాలా ఒక్కసారిగా కూలిన విషయం తెలిసిందే.రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
అటు నాలా కూలిన ప్రాంతాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.పాత నాలా కాబట్టే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
కుంగిపోయిన నాలాను తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టాలని రాజాసింగ్ కోరారు.