టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.ఈమె తెలుగు ప్రేక్షకులతో తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.
మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
లక్ష్మి తొలిసారిగా ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.
అలా పలు సినిమాలలో బాగా అవకాశాలు అందుకుంది.హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.
కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకోలేక అవకాశాలు అందుకోలేకపోయింది.
కేవలం సినిమాలలోనే కాకుండా ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.
టాలీవుడ్ బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్టింగ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తన అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.
తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో వీడియోలు కూడా పంచుకుంటుంది.
ఇక ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే చాలు బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ముఖ్యంగా తన మాటలతో మాత్రం అందర్నీ బాగా సందడి చేస్తుంది.అయితే తాజాగా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహతో ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకోగా దానికి సంబంధించిన ప్రోమో తాజాగా తను షేర్ చేసుకుంది.
ఇక అందులో తెలుగు పదాలు చెబుతూ బాగా రచ్చ చేసింది మంచు లక్ష్మి.
ఇక నిఖిల్ అడిగిన ప్రశ్నలకు చాలా సమాధానాలు చెప్పినట్లు కనిపించింది.ఇక తన ఇంట్లో ఏం జరిగిందో అన్న విషయాన్ని కూడా బయట పెట్టింది.ఇక ఇంట్లో కూర్చొని ఏ పని పాట లేకుండా కామెంట్లు కొట్టే వాళ్లని తను ఏమాత్రం పట్టించుకోనని తెలిపింది.
ఇక కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా చెబుతూ బాగా రచ్చ చేసింది.ఇక తన తండ్రి కింగ్ అంటూ తన తండ్రి గురించి చెప్పింది.ఇక ప్రభాస్ తన ఫస్ట్ లవ్ అంటూ.ప్రభాస్ గురించి గొప్పగా చెప్పింది.
ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో బాగా వైరల్ అవుతుంది.