బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సమాధానం చెబుతూ లేఖ రాశారు.ఓ వర్గాన్ని కించపరిచేాలా మాట్లాడారని రాజాసింగ్ ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.
అనంతరం ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది.ఈ నేపథ్యంలో తాను అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ నాలుగు పేజీల లేఖను పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్ పంపారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తాను పాల్పడలేదని తెలిపారు.
హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనపై అక్రమ కేసులు బనాయించారని వెల్లడించారు.టీఆర్ఎస్ , ఎంఐఎంలు కలిసి కుట్రపూరితంగా వంద కేసులు పెట్టారని తెలిపారు.
అంతేకాకుండా హైదరాబాద్ లో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
హిందువులకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని రాజాసింగ్ లేఖలో కోరారు.