తూర్పుగోదావరిజిల్లా రాజానగరం నియోజకవర్గంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు పెందుర్తి వెంకటేష్ మధ్య ఇసుకదుమారం రేగుతోంది.ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేయగా, కాదు కాదు ఇసుక దోపిడి మీరే పాల్పడ్డారని ఎమ్మెల్యే జక్కంపూడి కౌంటర్ ఇచ్చారు.
ఇసుక ఆదాయం ఎక్కువగా ఉండటం వల్లే తనను వైయస్సార్ పార్టీకి జిల్లా అధ్యక్షుని చేయడానికి ప్రామాణికమైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీ దోపిడీకి పాల్పడ్డ వెంకటేష్ ని తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే జక్కంపూడి ధ్వజ మెత్తారు.
తాను ఆరోపణలు చేయనని రుజువు చేసానని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ స్పష్టం చేశారు.ఆరోపణలు ప్రత్యఆరోపణలతో రాజానగరం నియోజకవర్గం రాజకీయం వేడెక్కింది.
ఏప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చి పెట్టె ఇసుక ఈ నియోజకవర్గంలోని సీతానగరం మండలంలో అందుబాటులో ఉండటంతో నియోజకవర్గం ప్రధాన పార్టీల మధ్య దుమారం రేగి తారాస్థాయికి చేరింది.







