కలక్టర్ ని హీరోయిన్ లా ఉన్నావ్ అన్న ఎమ్మెల్యే - దుమారం

ఆయనో ప్రజా ప్రతినిధి.రెండు లక్షల మది ఓటర్లకు ప్రతినిధిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.

ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేపట్టిన ఆందోళనలో ఆయన ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి బదులు ఓ మహిళా కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.అందంగా, హీరోయిన్ లా ఉన్న కలెక్టర్ నటించడం తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

ఇంకేముంది, సదరు ఎమ్మెల్యేగారి వ్యాఖ్యలు సోషల్ మీడియాకు ఎక్కాయి.నెటిజన్లు విమర్శల జడివాన కురిపించారు.

ఆ తర్వాత బీజేపీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.ఇదంతా ఇటీవల ఛత్తీస్ గఢ్ లో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో జరిగిన ఘటన.ఛత్తీస్ గఢ్ లోని సర్ గుజాలో జరిగిన ఈ ఆందోళనలో పాల్గొన్న సీతాపూర్ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్.ఆ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారి రితూ సేన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారు.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు