విప్రో ఉద్యోగులకి సూపర్ న్యూస్

ఇండియాలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ విప్రో, తమ సంస్థలో పనిచేస్తున్న 1,72,912 మంది ఉద్యోగులకు ఈ సంవత్సరం సరాసరిన 9.5 శాతం వేతనాల పెంపును ప్రకటించింది.

జూన్ 1 నుంచి వేతనాల పెంపు అమలవుతుందని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది.

"అర్హులైన ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతనాల పెంపు అమలవుతుంది.ఇండియాలోని ఉద్యోగులకు సరాసరిన 9.5 శాతం, విదేశాల్లోని ఉద్యోగులకు సరాసరిన 2 శాతం వరకూ వేతనాల పెంపు ఉంటుంది.ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి వేతనాల పెంపు అధికం" అని సంస్థ తెలిపింది.

కాగా, విప్రోకు పోటీగా ఉన్న టీసీఎస్ తమ ఉద్యోగులకు 8 నుంచి 12 శాతం, ఇన్ఫోసిస్ 6 నుంచి 12 శాతం వరకూ వేతనాలను పెంచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు