బీజేపీ నేతలు బుద్ధి లేకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… ధాన్యం సేకరణపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు.తెలంగాణపై కేంద్రం కక్ష గట్టి రైతాంగం పొట్టగొడుతోందని విమర్శించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని పీయూష్ గోయల్ దెబ్బ తీశారని ఆయన అన్నారు.
కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే పంచాయతీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నామని తెలిపారు.రైతులను యాసంగిలో వరి వెయ్యాలని బీజేపీ రెచ్చ గొట్టిందని ఆరోపించారు.
బీజేపీ నేతలు పిట్ట అరుపులు మానేసి తెలంగాణ ధాన్యం కొనేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వంద శాతం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా తమ ఉద్యమం కొనసాగుతుందని బాల్కసుమన్ స్పష్టం చేశారు
.