టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.ఈ మేరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లిన బాలయ్య పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో పాటు అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపై టీటీడీపీ నేతలతో చర్చిస్తున్నారు.అనంతరం భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేయనున్న బాలయ్య టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీ శ్రేణులు అంతా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించేందుకే ఆయన ఎన్టీఆర్ భవన్ కు వచ్చారని తెలుస్తోంది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబు అభిమానులు, టీడీపీ క్యాడర్ కొంత ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే.నేతలతో సమావేశం అనంతరం బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించనున్నారని సమాచారం.







