పాపం.. ఈ హీరోయిన్ ఇంట్లో పని చేసే వాళ్ళు చేసిన మోసానికి...

బాలీవుడ్లో పలు చిత్రాలు మరియు ధారావాహికలలో  ప్రధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ స్వర్గీయ నటి మిష్టి ముఖర్జీ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే మిష్టి ముఖర్జీ మొదట్లో అందరి నటీనటులలాగే సినిమా పరిశ్రమకి హీరోయిన్ కావాలని వచ్చింది.

 Misti Mukherjee Cheated By Her Home Maids In Mumbai, Misti Mukherjee, Bollywood-TeluguStop.com

 కానీ అనుకోకుండా సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అవకాశాలు లేక బాగానే ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలో  ఏ పాత్రలో అయినా సరే నటించడానికి సిద్ధ పడింది.

 దీంతో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి.అలాగే పలు చిత్రాలను గెస్ట్ అప్పీయరెన్స్ మరియు కామియే అప్పీయరెన్సు  పాత్రలలో కూడా కనిపించింది.

అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఈ అమ్మడు తన ఫిట్నెస్ పై శ్రద్ధ వహించక పోవడంతో బరువు బాగా పెరిగింది.దీంతో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో డబ్బులు సంపాదించడం కోసం మిష్టి ముఖర్జీ  పలు శృంగార తరహా సంబంధిత వస్తువులను మరియు క్యాసెట్లను అమ్ముతున్నట్లు ఆ మధ్య పోలీసులు మిష్టి ముఖర్జీ  ఇంటిపై రైడ్ చేసి కనుగొన్నారు. కానీ మిస్టి ముఖర్జీ మాత్రం ఈ వస్తువులతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంతేగాక తన ఇంట్లో పనిచేసే వాళ్లు ఆ వస్తువులను తన ఇంట్లో పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది.

అంతేగాక తాను పని నిమిత్తమై గోవా వెళ్లి వచ్చేసరికి ఇంట్లో కొన్ని బంగారు ఆభరణాలు అలాగే లక్షల రూపాయలు కండబదమ్ లేదని పోలీసులకి తెలిపింది.అయినప్పటికీ పోలీసులు మిష్టి ముఖర్జీ తండ్రి మరియు సోదరుడిని అరెస్టు చేశారు.

 దీంతో ఈ విషయం అప్పట్లో బాగానే కలకలం సృష్టించింది. అయితే ఈ  విషయం జరిగిన తర్వాత రెండు సార్లు మిష్టి ముఖర్జీ  వ్యభిచారం నిర్వహిస్తూ హోటళ్లలో పట్టుబడింది.

దీంతో ఈ అమ్మడు సినిమా కెరియర్ పూర్తిగా ముగిసి పోయింది.

కానీ సినిమాలపై ఉన్నటువంటి ఆసక్తి చావకపోవడంతో మిష్టి ముఖర్జీ మళ్లీ బరువు తగ్గి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.

 ఈ క్రమంలో బరువు తగ్గడానికి పలు సర్జరీలు కూడా చేయించుకుంది.కానీ అనుకోకుండా సర్జరీలు వికటించి గుండె పోటు రావడంతో మృతి చెందింది.ఏదేమైనప్పటికీ డబ్బు సంపాదించడం కోసంమిష్టి ముఖర్జీ అడ్డదారుల్లో వెళ్ళిన కారణంగానే ఆమె సినిమా కెరీర్ తో పాటు జీవితం కూడా ముగిసిపోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube