నిహారిక జాతకంలో దోషం... మళ్లీ పెళ్లి చేసుకున్న కష్టమే... వేణు స్వామి కామెంట్స్ వైరల్?

ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా డాటర్ నిహారిక విడాకుల( Niharika Divorce ) వార్తలు గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.నిహారిక పెళ్లైన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోవడంతో మెగా అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Mistake In Niharika Jatakam Remarriage Is Difficult, Niharika Divorce, Venu Swam-TeluguStop.com

ఈ క్రమంలోనే మెగా యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని క్యాష్ చేసుకొని మెగా కుటుంబం గురించి దారుణమైన వార్తలను సృష్టిస్తున్నారు.ఈ క్రమంలోనే నిహారిక విడాకులు తీసుకోవడంతో ఈమె విడాకుల వ్యవహారంలోకి వేణు స్వామిని ( Venu Swamy ) కూడా తీసుకోవచ్చారు.

వేణు స్వామి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తల్లో నిలచారు.

Telugu Nagachaitanya, Samantha, Venu Swamy-Movie

ఈయన చెప్పిన విధంగానే సమంత ( Samantha ) నాగచైతన్య ( Nagachaitanya ) ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.దీంతో ప్రస్తుతం నిహారిక వెంకటచైతన్య ( Venkata Chaitanya )విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరి గురించి వేణు స్వామి ముందే చెప్పారని ఓ వార్తను వైరల్ చేస్తున్నారు.అయితే ఈ వార్తలను మెగా ఫాన్స్ తిప్పి కొడుతున్నారు.

ఉద్దేశపూర్వకంగానే మెగా కుటుంబ పరువును మరింత తీయడం కోసమే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని మెగా ఫాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Nagachaitanya, Samantha, Venu Swamy-Movie

వేణు స్వామి నిహారిక వెంకటచైతన్య జాతకం చూసి వారి జాతకాలను కనుక చెప్పినట్లయితే ఈపాటికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారేది.కానీ అలాంటి వీడియో ఎక్కడ కనిపించలేదు.ఇది కేవలం యాంటీ ఫ్యాన్స్ పనేనని మరికొందరు ఈ వార్తలను తిప్పికొట్టేస్తున్నారు.

మరికొందరైతే దారుణంగా నిహారిక జీవితంలో దోషాలు కారణంగా ఇలా విడాకులు తీసుకుందని అయితే ఈమె మళ్లీ పెళ్లి చేసుకున్న కూడా సంతానం కలగడం కష్టమే అంటూ వేణు స్వామి చెప్పినట్టు ఈమె గురించి వార్తలను వైరల్ చేస్తున్నారు.అయితే ఈ వార్తలపై అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube