గడిచిన కొన్నాళ్లుగా కెనడాలో ఖలిస్తాన్( Khalistan in Canada ) మద్ధతుదారులు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.భారత దౌత్య కార్యాలయాలు, హిందూ దేవాలయాలు, గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు.
ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్రా ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మా పెరట్లో (కెనడా) పామలు తలెత్తి బుసలు కొడుతున్నాయని అన్నారు.
కర్ణాటక( Karnataka ) మూలాలున్న లిబరల్ పార్టీ నేత అయిన చంద్ర ఆర్య( Chandra Arya ).కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారులు పెరుగుతున్నారని, ఎప్పుడైనా వీరు కాటు వేయడం ఖాయమని హెచ్చరించారు.
జూలై 8న ‘ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ’( Khalistan Freedom Rally ) జరుగుతోందని .దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేశారు చంద్రా ఆర్య.కెనడాలోని ఖలిస్థానీలు హక్కుల చార్టర్‌ను దుర్వినియోగం చేయడంలో కొత్త స్థాయికి చేరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల దివంగత భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని( Indira Gandhi ) ఆమె అంగరక్షకులు హత్య చేసినట్లుగా వున్న బొమ్మలతో పరేడ్ నిర్వహించి సంబరాలు నిర్వహించారని, ఇఫ్పుడు ఏకంగా భారత దౌత్యవేత్తలపై హింసకు బహిరంగంగా పిలుపునిస్తున్నారని చంద్రా ఫైర్ అయ్యారు.

ఒట్టావాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ), టొరంటోలోని కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలను ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను( Hardeep Singh Nijjar ) చంపిన కిల్లర్స్‌గా కెనడాలోని ఖలిస్తాన్ మద్ధతుదారులు పోస్టర్లు విడుదల చేశారు.దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.పరిస్ధితి ఇలాగే కొనసాగితే ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు.ఇప్పటికే భారత్‌లోని కెనడా రాయబారికి ఇండియా సమన్లు సైతం జారీ చేసింది.

కాగా.ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఇటీవల కెనడాలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.ఇతను.ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు శిక్షణ, నిధులు వంటివి అందించేవాడు.నిజ్జర్‌కు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి.అలాగే ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆస్ట్రేలియాలో నిర్వహించిన రెఫరెండంలోనూ హర్‌దీప్ హస్తం వుంది.
ఇతని తలపై భారీ రివార్డ్ కూడా వుంది.అలాగే కెనడాకు అప్పగించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారత్ నిజ్జర్ పేరు కూడా చేర్చిన సంగతి తెలిసిందే.







