ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధనే ధ్యేయం

మార్చి 14న రిలే నిరాహార దీక్షఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారులు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షులు వనమా వేణుగోపాల్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఆర్యవైశ్యులకు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షులు వనమా వేణుగోపాల్ అన్నారు.

 Mission Of Arya Vaishya Corporation , Arya Vaishya Corporation , Khammam , Press-TeluguStop.com

ఖమ్మం ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కోసం ఈనెల 14న ఖమ్మం ధర్నాచౌక్ లో ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వారు తెలిపారు.

ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రిలే నిరాహారదీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర జనాభాలో 35 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారని, వారిలో అనేకమంది పేదలు, మధ్యతరగతి వారు ఆర్థిక ఇబ్బందులతో మగ్గుతున్నారని అన్నారు.

ఆర్యవైశ్యుల సంక్షేమాభివృద్ధికోసం.తాము మూల స్తంభంగా ఉన్నామని, వారికి ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారు తెలిపారు.

ఆర్యవైశ్యుల ఆశయ సాధనకోసం ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడభోమని అన్నారు.ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తాము నిద్రపోము, నిద్రపోనివ్వమని తెలిపారు.

ముఖ్యమంత్రి ఆర్యవైశ్యులకు ఇచ్చిన మాటకు కట్టుబడి వెయ్యి కోట్ల నిధులతో పూర్తి చట్టబద్ధత కల్పించి “తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్” ను వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు గోళ్ళ రాధాకృష్ణ, ప్రధానకార్యదర్శి గుమ్మడివెళ్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాశెట్టి వరప్రసాద్, కార్యనిర్వహక అధ్యక్షులు వెల్లంపల్లి వెంకట సుబ్బారావు, సభ్యులు కొంకిమల్ల మృత్యుంజయరావు, వెంపటి జగదీ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube