వరంగల్ జిల్లాలో( Warangal District ) పెళ్లి కొడుకు కనిపించకుండా పోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.హన్మకొండలోని గోకుల్ నగర్( Gokulnagar ) ప్రాంతానికి చెందిన కృష్ణతేజ అదృశ్యం అయ్యాడు.
కృష్ణతేజకు( Krishnateja ) నర్సంపేటకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం కాగా.వీరి వివాహం ఈ నెల 16న జరగాల్సి ఉంది.
ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన కృష్ణతేజ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కుటుంభ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎస్ఆర్ఎస్పీ కెనాల్( SRSP Canal ) పక్కన కృష్ణతేజ బైకును పోలీసులు గుర్తించారు.కృష్ణతేజ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.