దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్ అపార్ట్మెంట్( Ibrahim Kasam Apartment ) లోని ఫస్ట్ ఫ్లోర్ లోని ఓ ఫ్లాట్ లో 50 సంవత్సరాల వయసు ఉండే ఒక మహిళ మృతదేహం ప్లాస్టిక్ కవర్లో లభ్యం అవడంతో స్థానికంగా కలకలం రేగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మంగళవారం సాయంత్రం పోలీసులకు ఈ సంఘటనపై సమాచారం అందడంతో, సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఆ మహిళ ఎలా చనిపోయింది.
ఎప్పుడు చనిపోయింది అనే విషయాలు ఆరా తీయడం కోసం, మృతుదేహం లభ్యమైన ఇంట్లో 22 ఏళ్ల ఆమె కూతుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మృతి దేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె చనిపోయి రెండు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు.
కానీ ఇందులో ట్విస్ట్ ఏమిటంటే చనిపోయిన మహిళా సోదరుడు కాలాచౌకి పోలిస్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు.

ఈ విషయంపై చుట్టుపక్కల వాళ్ళను పోలీసులు అడుగగా దాదాపుగా రెండు నెలల నుండి బాధితురాలు కనిపించడం లేదని బయటపడింది.మృతదేహం నుండి దుర్వాసన రాకపోవడం వల్లే, ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలియదని పోలీసులు భావిస్తున్నారు.మిస్సింగ్ కేస్ ఫైల్ అయిన రెండు నెలలకు, ఇంట్లోనే మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ప్లాస్టిక్ కవర్లో లభ్యం అవడంతో దాదాపుగా హత్యకు గురై ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు మృతురాలి కుమార్తెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.మృతదేహం కుళ్ళిపోయే స్థితిలో ఉన్నా కూడా దుర్వాసన రాకపోవడం గమనార్హం.
మొదట మిస్సింగ్ కేసు కట్ చేస్తే కొద్ది రోజులకు శవమై కనిపించడం ఇలాంటి కోవకే చెందిన మరొక కేసు కూడా ముంబైలోని చించ్ పొక్లి ( Chinch Pokli )లో 19 ఏళ్ల వ్యక్తిపై మొదట మిస్సింగ్ కేసు ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉండే ఓ భవనం లో చేతులు, కాళ్లు కట్టేసి చంపిన సంఘటన స్థానికంగా ఉండే ప్రజలకు భయాందోళనకు గురిచేసింది.








