ములుగు జిల్లా వెంకటాపురంలో పెను ప్రమాదం తప్పింది.బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా.40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.యాదగిరి గుట్ట నుంచి భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కాగా ప్రయాణికులు ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వాసులుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.