మిరపకాయ్ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోను చూశారా.. కొడుకు క్యూట్ గా ఉన్నాడంటూ?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రిచా గంగోపాధ్యాయ్ ఒకరు.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లీడర్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

 Mirapakay Heroine Latest Photo Goes Viral In Social Media Mirapakay  , Tollywood-TeluguStop.com

లీడర్ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయినా రిచా గంగోపాధ్యాయ్ కు తెలుగులో బాగానే ఆఫర్లు దక్కాయి.

మిరపకాయ్ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ వినమ్ర అనే పాత్రలో నటించగా ఆ పాత్ర రిచాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

రిచా గంగోపాధ్యాయ్ తమిళం, బెంగాళీ భాషల్లో కూడా పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.మిర్చి సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించడంతో రిచాకు మంచి మార్కులు పడ్డాయి.

సారొచ్చారు, భాయ్ సినిమాలు ఫ్లాపైనా ఆ సినిమాల ప్రభావం రిచా కెరీర్ పై ఎక్కువగా పడలేదు.

Telugu Latest, Mirapakay, Mirchi, Tollywood-Movie

2019 సంవత్సరంలో రిచా గంగోపాధ్యాయ్ తన బాల్య స్నేహితుడిని వివాహం చేసుకున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకోవడం ద్వారా రిచా గంగోపాధ్యాయ్ గతంలో వార్తల్లో నిలిచారు.ఈ దంపతులకు గతేడాది మే నెల 27వ తేదీన ఒక బాబు పుట్టగా ఆ బాబు పేరు లూకా షాన్ లాంగెల్లా కావడం గమనార్హం.

అయితే రిచా గంగోపాధ్యాయ్ భర్త, కొడుకుతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో రిచా గంగోపాధ్యాయ్ కొడుకు చాలా క్యూట్ గా ఉన్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రిచా గంగోపాధ్యాయ్ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఫ్యాన్స్ కోరికను మన్నించి రిచా గంగోపాధ్యాయ్ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.రిచాకు సోషల్ మీడియాలో మాత్రం భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube