గుంటుపల్లి మెడికల్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు.పనివేళల్లో ఆస్పత్రుల్లో ఉండటం లేదంటూ స్థానికుల ఫిర్యాదు.
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మంత్రి విడదల రజిని గారి ఎదుట ఏఎన్ ఎంల ఆవేదన.బల్లికురవ మండలం గుంటుపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు.
ఆస్పత్రి నిర్వహణలో లోపాలను గుర్తించి మండిపడ్డ మంత్రి గారు.ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంటే క్షేత్రస్థాయి సబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ ఆగ్రహం.
గుంటుపల్లి వైద్యాధికారిని విధుల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు.అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ, పాలనాపరమైన విచారణ కూడా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం గుంటుపల్లి పీహెచ్సీ వైద్యాధికారి భానుప్రకాష్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
పీహెచ్‌సీని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలో నిర్వహణ లోపాలను గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆస్పత్రి పరిధిలోని పలువురు ఏఎన్ ఎంలు మంత్రి గారి వద్దకు చేరుకుని తమతో మెడికల్ ఆఫీసర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిసస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానికులు సైతం వైద్యాధికారి విధులకు సరిగా రావడంలేదని, పనివేళ్లలో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నాడని ఆరోపించారు.
స్పందించిన మంత్రి గారు వెంటనే భానుప్రకాష్‌ను విధుల నుంచి తప్పించాలని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న ఉన్నతాధికారులను ఆదేశించారు.ఆ వెంటనే మెడికల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పాలనాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.