కళ్యాణదుర్గానికి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి ఉష శ్రీ చరణ్ మండిపడ్డారు.తాడిపత్రి లో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కలిసి, ఆమె మీడియా తో మాట్లాడుతూ బీసీ మహిళకు మంత్రి పదవి లభించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేకుండా ఉన్నారన్నారు.
ప్రజల మద్దతు కోల్పోయినా, రాజకీయాలు చేయడం టిడిపి వారికే చెల్లుతుందన్నారు.వెయ్యి గొర్రెల మందలో ఒక్క గొర్రె తప్పి పోయినా, తిరిగి తీసుకొని వచ్చి కలిపే శక్తి నాకు ఉందని తెలిపారు.
తనపై దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు.క్యాబినెట్ విస్తరణ లో 45 శాతం బీసీలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత జగనన్నకే సాధ్యమన్నారు.
అనంతపురం జిల్లాలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారని, బీసీలు అందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం తమ పార్టీకి సాధ్యమన్నారు.జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరిని కలిసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుస్తున్నానని తెలిపారు.







