తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana Assembly Sessions ) నాలుగో రోజు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా సిగరెట్, టొబాకో చట్ట సవరణ బిల్లు 2024( Cigarettes and Other Tobacco Products Act )కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
సిగరెట్ తో పోలిస్తే హుక్కా మరింత ప్రమాదకరమని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.బిల్లు ఆమోదంతో పకడ్బందీగా హుక్కా నిషేధం అమలు చేస్తామని తెలిపారు.
హుక్కా సేవించడం ఇకపై పూర్తిగా నిషేధమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.