తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) కొలువుదీరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) పదవి బాధ్యతలు చేపట్టాక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముందుగా ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది.ఆ తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజా పాలన దరఖాస్తు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇదిలా ఉంటే హామీల విషయంలో అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ప్రతిపక్షాలు విమర్శలు చేయటంపై మంత్రి సీతక్క( Minister Seethakka ) సీరియస్ అయ్యారు.
నెల రోజులకే బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు.
అధికారం లేకపోవడంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలను పదేళ్లలో అమలు చేశారా.? అని ప్రశ్నించారు.వంద రోజులలో గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు.
త్వరలోనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్( Gas Cylinder ) తో పాటు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని మంత్రి సీతక్క తెలియజేయడం జరిగింది.ఇదే సమయంలో తాను ఇంచార్జిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 26వ తారీకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పేర్కొన్నారు.