రంగ రెడ్డి జిల్లా:- ఖైరతాబాద్ వినాయకునికి ఎంత విశిష్టత ఉందో, బాలాపూర్ వినాయకునికి అంతే విశిష్టత ఉంది అని బాలాపూర్ వినాయకుడు నా నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సబితా రెడ్డి అన్నారు.తొలి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.
రైతులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.బాలాపూర్ గణనాధునికి ఉన్న విశిష్ట ప్రజలందరికీ తెలుసు అని మంత్రి అన్నారు.
అందరు కలిసి మెలిసి గణేష్ ఉత్సవాన్ని జరుపుకోవాలని మంత్రి సూచించారు.మంత్రి వెంట కార్పొరేటర్లు, నాయకులు, కోఆప్షన్ సభ్యులు రఘునందన చారి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మి లక్ష్మారెడ్డి , కళ్లెం ఎల్లారెడ్డి, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి, చిగురింత పెద్ద నరసింహారెడ్డి, తిమ్మని గిరీష్, కొప్పుల రాజు ,అరవింద్ గౌడ్, మురళి, వంగేటి అశ్విన్ రెడ్డి, బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.