విజయవాడ: చేనేత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని ఏపీ టూరిజం మంత్రి రోజా అన్నారు.గురువారం పిన్నమనేని పాల్ క్లినిక్ రోడ్ ఆప్కో షోరూమ్‌ను మంత్రి సందర్శించారు.
అనంతరం రోజా మాట్లాడుతూ… ఆప్కో సమ్మర్ సారీ మేళాకి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి కలెక్షన్స్‌ను ఆప్కో అందిస్తుందని తెలిపారు.
ఆప్కో షోరూమ్ బ్రాంచెస్‌ను ప్రతి ఊరిలోనూ ప్రారంభించారని చెప్పారు.ప్రత్యేక ఆఫర్లతో ఆప్కో షోరూమ్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.చేనేత కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఏడాది రూ.24 వేలు నేతన్న చేనేత పథకం కింద అందిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.







