ఇదేం సుడి బాబు....భారతీయుడి లాటరీల స్టొరీ వింటే మైండ్ బ్లాకే...!!!

అదృష్టం మనిషికి ఒక్కసారే వస్తుంది, కానీ దరిద్రం అలా కాదు తలుపు తీసేంత వరకూ కొడుతూనే ఉంటుంది.ఆ ఒక్క సారి వచ్చిన అదృష్టాన్ని తెలివిగా ఉపయోగించుకున్న వాడే జీవితంలో ముందుకు వెళ్తాడు.

 Listening To The Story Of Indian Lotteries Is Mind Boggling , Indian Lotteries-TeluguStop.com

కానీ అదృష్టం తలుపు తీసే వరకూ కొట్టిన సందర్భాలు ఎవరైనా చూశారా, అనుభవించారా అంటే అతితక్కువ సందర్భాలు మాత్రమే మనకు తారస పడుతాయి.ఈ విషయంలో భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దుబాయ్ లో ఉండే భారతీయులకు అదృష్టం వచ్చిందంటే అది పక్కా లాటరీ టిక్కెట్టు ద్వారా వచ్చిందని కళ్ళు మూసుకుని మరీ చెప్పేయచ్చు.దుబాయి లో లాటరీలు భారతీయుల కోసమే పుట్టాయా అన్నట్టుగా అక్కడ డ్రా తీసే ప్రతీ సారి భారతీయులు గెలుపొందుతూనే ఉంటారు.

అసలు లాటరీ తగలడమే అతి పెద్ద అదృష్టంగా భావిస్తాం అలాంటిది ఒకే మనిషికి రెండు సార్లు పెద్ద మొత్తంలో లాటరీలో గెలుపొందితే అలాంటి వాళ్ళను ఏమంటాం సుడిగాడనే అంటాం.ఇప్పుడు అలాంటి సుడున్న భారతీయుడి గురించి తెలుసుకుందాం…వివరాలలోకి వెళ్తే.

భారత్ కి చెందిన సునీల్ శ్రీధరన్ దుబాయ్ లో ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.కనీసం సొంత ఇల్లుకూడా కట్టుకోలేని పరిస్థితులో ఉన్న సునీల్ తన అదృష్టాన్ని లాటరీ ల ద్వారా పరీక్షించుకోవాలని భావించాడు.

అనుకున్నదే తడవుగా 2019 లో దుబాయి డ్యూటీ ఫ్రీ లో లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.మొదటి సారే అయినా సునీల్ ను అదృష్ట దేవత గట్టిగానే కరుణించింది.ఏకంగా మొదటి లాటరీలో అతడు 1 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీ లో రూ.6 కోట్లు పై మాటే ) గెలుచుకున్నాడు.అయితే సరిగ్గా రెండేళ్ళ వ్యవధిలో తాజాగా అతడు మళ్ళీ అదే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీలో 1 మిలియన్ డాలర్లు గెలుచుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇదిలాఉంటే ఇప్పటి వరకూ 1 మిలియన్ డాలర్ల లాటరీని 100 కి పైగా భారతీయులు గెలుచుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube