సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగినప్పటి నుండి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.మంచి విషయమైన, చెడు విషయమైన సోషల్ మీడియాలో వెంటనే షేర్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఇతరులను ఉద్దేశించి నెగటివ్ కామెంట్లు, ట్రోల్స్ బాగా చేస్తున్నారు.ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి మాత్రం సోషల్ మీడియా తో బాగా సంబంధం ఉందని చెప్పవచ్చు.
సినిమా విషయంలో మాత్రం సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సోషల్ మీడియా ద్వారా తెగ బయటపడుతున్నాయి.
ముఖ్యంగా ట్రోల్స్, కామెంట్స్ రూపంలో ట్రోల్లర్స్, నెటిజన్లు ఓ రేంజ్ లో ఆట ఆడుకుంటున్నారు.ఇక స్టార్ హీరోల అభిమానులు మాత్రం ఇతర స్టార్ హీరో లను ఉద్దేశించి బాగా ట్రోల్స్ చేస్తుంటారు.
ఆ హీరోల అభిమానులు గతంలో తమ హీరోలను ఇతరుల హీరోల అభిమానులు అన్న మాటలను దృష్టిలో పెట్టుకొని వెంటనే వాటి పై పగ తీర్చు కుంటారు.అది కూడా సోషల్ మీడియా ద్వారానే చూపిస్తారు.
చాలా సందర్భాలలో అలాంటివి సినిమా విడుదల సమయంలోనే చూసుకుంటారు.అలా తాజాగా కూడా మహేష్ బాబు సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈరోజు మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా కొంతవరకు ఆకట్టుకున్న కూడా ఎందుకో ప్రేక్షకులు, అభిమానులు కాస్త నిరాశ చెందినట్లు అనిపిస్తుంది.
కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.ఊహించిన దానికంటే తక్కువ రిజల్ట్ రావటంతో బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

కారణం ఏమిటంటే గతంలో వకీల్ సాబ్ సినిమా డిజాస్టర్ అని దారుణంగా ట్రోల్ చేశారు.కానీ ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కొంత కాలం గ్యాప్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.కానీ ఆ సమయంలో కొందరు ఈ సినిమాను డిజాస్టర్ వకీల్ సాబ్ అనే ట్యాగు తో బాగా ట్రెండ్ చేశారు.
దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్కారు వారి పాట డిజాస్టర్ అనే ట్యాగ్ తో ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.
దీంతో ఈ ట్రోల్స్ చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.మహేష్ బాబు అభిమానులు మాత్రం నెగటివ్ కామెంట్లతో ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కొందరు మాత్రం గతంలో జరిగిన విషయాలను తవ్వుతూ ఈ సినిమాతో పోలుస్తున్నారు.మరి ఈ విషయం గురించి మహేష్ బాబు అభిమానులు బయట ఎంత రచ్చ చేస్తారో చూడాలి.
ప్రస్తుతం సర్కారు వారి పాట మాత్రం థియేటర్లో సందడి చేస్తుంది.







