టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు 2024లో జరిగే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అన్న కసితో రాజకీయాలలో కూడా బాగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలోనే రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై గత కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో విడుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
దీంతో వైసిపి ప్రభుత్వం మంత్రులు చాలామంది పవన్ కళ్యాణ్ మాటలను ఎదుర్కోవడానికి రంగంలోకి దిగాల్సి వస్తోంది.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాయాత్రకి రెడీ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రజా యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఒక వాహనాన్ని స్పెషల్ గా రెడీ చేయించుకున్నారు.ఆ వాహనానికి వారాహి అనే పేరును కూడా పెట్టిన విషయం తెలిసిందే.
ఆ వారాహి వాహనానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అవుతున్నాయి.ఆ వారాహి వాహనం చూడటానికి మిలటరీ ఆర్మీ వాళ్ళు ఉపయోగించే వాహనంలా కనిపిస్తోంది.
కాగా ఈ వాహనాన్ని చూసిన జనసేన సైనికులు వైసీపీ పై యుద్ధానికి సింబల్గా ఆర్మీ వాహనాల రంగుతో వైసిపి పై యుద్ధానికి రెడీ అవుతోంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ తన వాహనాన్ని పరిచయం చేస్తున్న వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.
ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ వాహనం పై మండిపడుతూ తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై భారీగా సెటైర్స్ వేసింది.అది వారాహి వాహనం కాదు నారాహి వాహనం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేకాకుండా పవన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ దోస్తులే అన్న విధంగా పంచులు వేస్తూ నారాహి అనే పేరుతో పోల్చింది మంత్రి రోజా.
కాకుండా ఆ వాహనంతో ఎవరి సైన్యంతో చేరి యుద్ధానికి వస్తున్నారో చెప్పాలి.పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేయడం కాదు.అలాగే తమ వారాహి వాహనంపై వైసిపి వారు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు మీకు అనుకూల మీడియానే మీ గురించి బయట పెట్టింది అని తెలిపింది రోజా.ఆర్మీ జవాన్ల వాహనాలకు ఆ కలర్ వాడతారని అన్నాము అంటూ పవన్ పై పవన్ వాహనంపై రోజా కామెంట్స్ చేసింది.
అందుకు సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







