తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ జంట వర్ష, ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ స్టేజ్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ జంట ప్రస్తుతం జబర్దస్త్ లో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు ఈవెంట్లలో పాల్గొంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న విషయం తెలిసిందే.
మొదట సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష ఆ తర్వాత జబర్దస్త్ లో లేడీ కామెడియన్ గా ఎంట్రీ ఇచ్చింది.జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ని చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు వర్ష తన గ్లామర్ తో సరికొత్త అనుభూతిని ఇచ్చింది.
ఇక వర్ష ఇమ్మాన్యుయేల్ తో లవ్ ట్రాక్ నడుపుతూ మరింత ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్,యాంకర్ రష్మీ ల జంట తర్వాత అంత పాపులారిటీని సంపాదించుకుంది వర్ష ఇమ్మానుయేల్ జంట.అతి తక్కువ కాలంలోనే ఈ జంట భారీగా పాపులర్ అయ్యింది.ఇప్పటికే జబర్దస్త్ స్టేజ్ పై అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై వర్ష పలుసార్లు ఇమ్మాన్యుయేల్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.
అయితే ఈ జంట సుడిగాలి సుధీర్ జంట మాదిరిగానే కేవలం ఫెమ్ కోసం ఈ విధంగా చేస్తున్నారా లేకపోతే నిజంగానే వీరు ప్రేమించుకుంటున్నారా అన్న విషయం మాత్రం అర్థం కావడం లేదు.అయితే జబర్దస్త్ లో చాలామంది కమెడియన్స్ తో పాటు ఆఖరికి ఇమ్మాన్యుయేల్ కూడా వర్షాన్ని చూసి ఆమె అమ్మాయి కాదు లేడీ గెటప్ అంటూ పంచులు వేస్తూ ఉంటారు.
ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ స్టేజ్ పై పలుసార్లు అనడంతో వర్ష హర్ట్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా మరొకసారి ఇదే కామెంట్స్ చేశాడు ఇమ్మాన్యుయేల్. అందులో ఇమ్మాన్యుయేల్ రాజు గెటప్ వేయగా భార్యగా వర్ష నటించింది.స్కిట్ లో భాగంగా నేను ఉండగా మరొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని వర్ష అడగగా.
వెంటనే ఇమ్మాన్యుయేల్ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే తెలిసింది అమ్మాయి కాదని అందుకే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఆమెపై సెటైర్లు వేశాడు.ఆ మాట అనగానే వర్ష సీరియస్ అయ్యింది.
మరి వర్ష నిజంగానే సీరియస్ అయ్యిందా లేకపోతే స్కిట్లో భాగమా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.








