తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర మంత్రి రోజా, సినీ నటి రవళి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి రోజా, సినీ నటి రవళికు ఆలయం వద్ద ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు, ఇంచార్జ్ సూపర్డెంట్ ప్రసాద్ ,
ఇన్స్పెక్టర్ అశోక్, ఆగమ సలహాదారు శ్రీనివాస్చార్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు.అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసారు.







