Ukraine Minister Dmytro Kuleba: భారత్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ మంత్రి..!!

రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొద్ది నెలల నుండి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Minister Of Ukraine Who Made Serious Comments On India Details, Ukrainian Foreig-TeluguStop.com

ఈ యుద్ధంలో రష్యా బలగాలు తీవ్రస్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి.ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుని రష్యా చేసిన దాడులకు… చాలామంది ప్రజలు దేశం విడిచి సరిహద్దుల గుండా పారిపోయారు.

ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ నీ పూర్తిగా అంధకారంలోకి నెట్టేయటానికి… అక్కడి విద్యుత్ కర్మగారాలపై రష్యా భారీ స్థాయిలో దాడులకు పాల్పడుతుంది.

ఇటువంటి తరుణంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా భారత్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఓవైపు తాము చనిపోతూ ఉంటే మరోవైపు రష్యా నుండి భారత్ చమురును కొనుగోలు చేయటం నైతికంగా సరికాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాము ఇటువంటి దుర్భార పరిస్థితుల్లో ఉన్నందువల్లే భారత్ కి ఈ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.“ఉక్రెయిన్ ల బాధలు నుంచి భారత్ ప్రయోజనం పొందాలని భావిస్తే… ఉక్రెయిన్ కి మరింత సహాయం చేయాలని” కులేబా.పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube