ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.గత రెండు రోజులుగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ దాడులపై ఆయన మాట్లాడుతూ ఇంత దౌర్జన్యం ఎన్నడూ చూడలేదన్నారు.కేంద్ర బలగాలతో తమపై దాడులు చేశారని మండిపడ్డారు.
కొడుకు ఆస్పత్రి పాలైతే కనీసం చూడనివ్వలేదని చెప్పారు.దాడులు జరుగుతాయని సీఎం కేసీఆర్ ముందే చెప్పారని తెలిపారు.
బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కేసీఆర్ ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు.
ఎన్నో ఏళ్లుగా కాలేజీలను నిర్వహిస్తున్నామని, పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుదగా తీర్చిదిద్దుతున్నామని మల్లారెడ్డి తెలిపారు.
పేదలకు సేవ చేయాలనే తక్కువ ఫీజుతో విద్య అందిస్తున్నామన్నారు.మేనేజ్ మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు.
ఐటీ దాడులను తప్పుబట్టడం లేదన్నారు.ఐటీ దాడులు కొత్త కాదన్న మంత్రి మల్లారెడ్డి ఇదో మూడోసారి సోదాలు చేయడమని చెప్పారు.ఐటీ దాడుల్లో దొరికింది కేవలం రూ.28 లక్షలేనని స్పష్టం చేశారు.