సాధారణంగా ఒక హీరో లేదా హీరోయిన్ కథను నమ్మి సినిమా చేస్తున్నారు అంటే తప్పకుండా ఆ సినిమా విజయం అవుతుందని భావించి సినిమాలు చేస్తుంటారు.ఇలా కథ పైన నమ్మకంతో సినిమా కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడమే కాకుండా ఆ సినిమా మంచి సక్సెస్ అయితే తమకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుందని అలాంటి పేరు తెచ్చుకోవడం కోసమే కష్టపడుతూ సినిమాలలో నటిస్తుంటారు.
అయితే ఇలా సినిమాలపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ కొన్నిసార్లు ఆ అంచనాలు తారుమారు అవుతుంటాయి.అల్లరి నరేష్ విషయంలో కూడా ఓ సినిమా తన అంచనాలను పూర్తిగా తారుమారు చేసిందని తెలిపారు.
అల్లరి నరేష్ ఒకానొక సమయంలో వరుస కామెడీ చిత్రాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ మధ్యకాలంలో ఈయన చాలా తక్కువ సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక తాజాగా ఈయన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా ద్వారా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లరి నరేష్ తన గత సినిమాల గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన జీవితంలో ఎంతగానో కథను నమ్మి చేసిన సినిమా నేను. ఈ సినిమా ద్వారా తన జీవితమే మారిపోతుందని భావించాను.అయితే ఈ సినిమా పూర్తిగా తన అంచనాలను తారుమారు చేసిందని నరేష్ వెల్లడించారు.
ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి జ్ఞాపకాలను మాత్రం మిగిల్చింది అంటూ ఈ సందర్భంగా నేను సినిమా గురించి నరేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ సినిమాలో చేసిన అనంతరం తనకు గమ్యం శంభో శివ శంభో మహర్షి వంటి సినిమాలలో అవకాశాలు వచ్చాయని తెలిపారు.







