వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మొత్తం వరి ధాన్యం కొనుగోళ్ల చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి ఉంది.ఇంకా వారం పది రోజులే సమయం ఉన్న పరిస్థితుల్లో ఇటు కేంద్రం నుండి కాని రాష్ట్ర ప్రభుత్వం నుండి కాని సరైన స్పందన లేక రైతులు అయోమయానికి గురవుతున్న పరిస్థితి ఉంది.

 Minister Ktr Fires At Bjp Over Paddy Procurement , Bandi Sanjay , Ktr , Bjp Par-TeluguStop.com

దీంతో ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఈ సందర్బంలో నేడు కేటీఆర్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు నిరసన సభలో పాల్గొన్న సమయంలో మంత్రి కేటీఆర్ బీజేపీపై పెద్ద ఎత్తున విరుచుకపడ్డ పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా మంత్రి కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.  వరి ధాన్యం కొనుగోలు చేసేదాక కేంద్రాన్ని వదిలిపెట్టే సమస్యే లేదని రైతులను గోస పెట్టిన ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదని కెటీఆర్ అభిప్రాయపడ్డారు.

అయితే ఉప్పుడు బియ్యంపై ఇతర దేశాలలో పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నా తెలంగాణ రైతులను టీఆర్ఎస్ పార్టీపైకి ఉసిగొల్పాలనే  ఉద్దేశ్యంతోనే తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులందరూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో బీజేపీ పార్టీ కి ప్రజలు బుద్ది చెబుతారని మంత్రి  కెటీఆర్ అభిప్రాయ పడ్డారు.అయితే కెటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఇంకా స్పందించకపోయినా త్వరలో స్పందించే అవకాశం ఉంది.

అయితే కెటీఆర్ మాత్రం ఇంకా ఈ నిరసనను ఉధృతం చేస్తామని ధాన్యం కొనుగోలు ఎలా చేయదో చూస్తామని ఒకవేళ అప్పటికీ కొనుగోలు చేయకపోతే అప్పుడు తమ విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించిన  విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube