తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS ) చాలా స్పీడ్ గానే ఉంది.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక రాజకీయ వ్యూహాలకు తెర తీస్తోంది.
పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది.దీంతో పాటు ముందుగానే కీలకమైన కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తుంది.
ఇంకా కాంగ్రెస్, బిజెపిలు పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉండగానే, బీఆర్ఎస్ మాత్రం దూకుడుగా అభ్యర్థులను ప్రకటిస్తూ, ఎన్నికల సమరానికి తాము సిద్దమనే సంకేతాలను ఇస్తుంది.దీంతో పాటు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో గందరగోళం నెలకొనడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడంతో, పార్టీ అక్కడ నష్టపోకుండా గ్రూపు రాజకీయాలు పెరగకుండా, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ, అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు.ముఖ్యంగా ఈ విషయంలో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్( Minister KTR ) కీలకంగా వ్యవహరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితమే హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కౌశిక్ రెడ్డిని( Koushik Reddy ) కేటీఆర్ ప్రకటించారు.దీంతో పాటు మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు కేటీఆర్.
హుస్నాబాద్ లో పర్యటించిన కేటీఆర్ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్ పేరును ప్రకటించారు.అలాగే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్( Vinod Kumar ) పోటీ చేస్తారని తేల్చి చెప్పారు.
ఆయన ను మంచి మెజారిటీతో గెలిపించాలంటూ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.దీంతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విషయంలో గందరగోళం నెలకొనడంతో, అక్కడి నుంచి పోటీ చేయబోయేది దాస్యం వినయ్ భాస్కర్ అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించి అక్కడ చోటు చేసుకున్న గందరగోళానికి పుల్ స్టాప్ పెట్టే విధంగా కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఈ విధంగా బీఆర్ఎస్ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తుంది.సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ అభ్యర్థులు ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నాయి ? సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి ? ఇలా అనేక విషయాలపై సర్వే నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.







