సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు రావడం సర్వసాధారణం.ఎంతో మంది సీనీ, రాజకీయ క్రీడ రంగానికి చెందినటువంటి ప్రముఖుల బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajashekhar Reddy ) జీవిత కథ ఆధారంగా యాత్ర ( Yatra ) సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా కథ ఎన్నికల ముందు విడుదల కావడంతో వైసిపి పార్టీకి ఈ సినిమా కాస్త అనుకూలంగానే మారిందని చెప్పాలి.
ఇలా యాత్ర సినిమా రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాగా తాజాగా ఈ సినిమా సీక్వెల్ చిత్రం కూడా ఉంటుందని డైరెక్టర్ మహి వి రాఘవన్ ఓ సందర్భంలో తెలియజేశారు.

యాత్ర 2( Yatra 2 ) తప్పకుండా ఉంటుందని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని ఈయన ఓ సందర్భంలో తెలియజేశారు.అయితే ఈ సినిమాను కూడా 2024 ఎన్నికలకు ముందే విడుదల చేయాలన్న ఆలోచనలో డైరెక్టర్ మహి వి రాఘవన్ ( Mahi V Raghavan ) ఉన్నట్టు సమాచారం.అయితే యాత్ర 2 లో జగన్ ( Jagan ) పాత్ర హైలెట్ కానుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.

మొదట్లో యాత్ర 2సినిమాలో జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు సూర్య( Surya ) నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా సూర్య కాకుండా రంగం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అయినటువంటి తమిళ హీరో జీవా( Jeeva ) నటించబోతున్నారని సమాచారం.మరి ఈ సినిమాలో జగన్ పాదయాత్ర,ఆయన ముఖ్యమంత్రి కావడం గురించి హైలెట్ చేస్తారా లేకపోతే పాదయాత్రను మాత్రమే హైలైట్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం డైరెక్టర్ మహి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం.







