టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అశ్వినీదత్( Aswani Dutt ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి, బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ రాబోయే జనరేషన్స్ ను నిర్మించాడని హీరో అంటే అన్నగారిలా ఉండాలని తెలిసేలా చేశారని చిరంజీవి గారు కూడా అలానే ఉన్నారని ఆయన తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో అత్యంత గొప్ప వ్యక్తి అని అశ్వినీదత్ వెల్లడించారు.

అదే విధంగా చిరంజీవి( Chiranjeevi ) కూడా కొన్ని విషయాల్లో గొప్ప వ్యక్తి అని అశ్వినీదత్ పేర్కొన్నారు.సీనియర్ ఎన్టీఆర్ దేవుని వేషాలు ఎక్కువగా వేయడం వల్ల ఆయనను దైవాంశ సంభూతుడని అనుకుంటామని అదే క్రమశిక్షణ చిరంజీవిలో కూడా ఉందని ఆయన అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక శిఖరం అయితే చిరంజీవిగారు మరో శిఖరం అని అశ్వినీదత్ కామెంట్లు చేశారు.
తండ్రి ఎంత గొప్ప వ్యక్తి అయినా బాలయ్య మాత్రం సింపుల్ గానే ఉండేవారని ఆయన తెలిపారు.

చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారో బాలయ్య( Nandamuri Balakrishna ) కూడా అంతకంటే ఎక్కువే కష్టపడేవారని అశ్వినీదత్ వెల్లడించారు.నాగార్జున, వెంకటేశ్ లలో కూడా ఆ క్రమశిక్షణ సాగిందని ఆయన తెలిపారు.అశ్వినీదత్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నా కూతుళ్లకు కూడా కెరీర్ తొలినాళ్లలో ఎదురుదెబ్బలు తగిలాని అశ్వినీదత్ కామెంట్లు చేశారు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి కూతుళ్లకు వరుసగా విజయాలు దక్కాయని ఆయన తెలిపారు.

నా పిల్లలు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.అశ్వినీదత్ నిర్మాతగా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేతతలు ఉన్నాయి.ప్రాజెక్ట్ కే మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాతో అశ్వినీదత్ కు ఎలాంటి సక్సెస్ దక్కుతుందో చూడాలి.







