తెలంగాణ మంత్రులు కొప్పుల ఈశ్వర్ మరియు ఎర్రబెల్లి దయాకర్‌రావులు జగిత్యాల జిల్లా హిమ్మత్ రావు పేట పర్యటనకు వెళ్తున్న సమయంలో కొండగట్టు బస్సు యాక్సిడెంట్ బాధితుల కుటుంబ సభ్యులు రోడ్డుపై భైటాయించారు.ఈ విషయం ముందుగా తెలియని పోలీసులు ప్రత్యేక చర్యలు ఏమీ తీసుకోలేదు.
మంత్రులు అటుగా వెళ్తున్న విషయం తెలుసుకుని వారిని అడ్డుకునేందుకు రాం సాగర్ చౌరస్త వద్ద పెద్ద ఎత్తున బస్సు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు ఇంకా రైతులు చేరుకున్నారు.
రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడంల ఏదు అంటూ ఈ సందర్బంగా స్థానికులు మంత్రులను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
మంత్రులను అడ్డుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఈ విషయమై వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా మంత్రులకు వారు రోడ్డుకు దారి ఇవ్వలేదు.
వెనక్కు వెళ్లకుండా ముందుకు వెళ్లకుండా వారు భైటాయించడంతో మంత్రులు దాదాపు 30 నిమిషాల పాటు అక్కడే ఉండి పోయారు.పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రైతులు మరియు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి చర్చలు జరపడం జరిగింది.
దాంతో కొద్ది సమయంకు మంత్రుల కాన్వాయ్‌కు దారి ఇచ్చారు.







