ప్రపంచంలోని ఎన్నో దేశాల వారికి డ్రీమ్ అమెరికా వెళ్లడం.అక్కడ బాగా చదువుకుని, మంచిగా సంపాదించాలని చాలా మంది కలలుకంటూ ఉంటారు.
ఇలా అమెరికా వెళ్లిన వారికి అక్కడ ఇంటి అద్దెలు చుక్కల్ని చూపిస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం ఓ స్టార్టప్ కంపెనీ సిలికాన్ వ్యాలీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి పనిచేసే ఉద్యోగులకు 10 వేల డాలర్లు (సుమారు 6.5 లక్షలు) ఇస్తామంటూ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
సిలికాన్ వ్యాలీకి బయట ఉండే ఇళ్ల అద్దెలు, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో అక్కడికి వెళ్లి పనిచేయాలని భావిస్తున్నారు.పరిస్థితి నానాటికి దిగజారిపోతుండటంతో ఈ క్రమంలో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఏటికేడు పెరిగిపోతున్న అద్దెలను కంట్రోల్ చేసేందుకు బిల్లు ను ఆమోదించింది.దీని ప్రకారం ఇంటి యజమానులు ఏడాదికి 5% మాత్రమే అద్దెను పెంచడానికి వీలుంది.ఈ ఏడాది మార్చి నెల నుంచి బిల్లు అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో ఇంటి అద్దె నివారణకు చట్టాన్ని తీసుకొచ్చిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.