నెల్లూరు జిల్లా: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్స్.లోన్ యాప్ ల్ ద్వారా రుణాలు తీసుకుని పలువురు ఇబ్బందులు పడుతున్నారు.
కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ముత్తుకూరులో గడప గడపలో ఉండగా 79 కాల్స్ నా నంబర్ కు చేశారు.
సాధారణంగా నేనే ఫోన్ ఎత్తుతాను.కానీ గడప గడపకూ కార్యక్రమంలో వున్నాను.
దీంతో నా వ్యక్తిగత సహయకుడు ఫోన్ తీశారు.కానీ నాకు ఎందుకు ఫోన్ చేశారనే విషయం పై ఆరా తీశా.
రుణం తీసుకున్న అశోక్ కుమార్ నా నంబర్ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని చెప్పారు.అందుకే ఫోన్ చేస్తున్నామని చెబుతున్నారు.పోలీసుల వివరాలు సేకరించి నలుగురిని అరెస్ట్ చేశారు.వారిని విడిపించేందుకు పది మంది ప్రముఖ లాయర్ లు రావడం ఆశ్చర్యంగా ఉంది.
ఈ ముఠాను ట్రాప్ చేసేందుకు.పోలీసుల విచారణలో భాగంగా మా పిఏ 25,000 రూపాయలు చెల్లించడం జరిగింది.
ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే పోలీస్ కు కానీ నాకు కానీ చెప్పండి.ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.