కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.నిర్మలా సీతారామన్ మాటలలో నిజాయితీ లేదని మండిపడ్డారు.
కేంద్రం తెలంగాణకు ఇచ్చింది గోరంత చెప్పేది కొండంత అని హరీశ్ రావు విమర్శించారు.దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్ పూర్తి ఆధారాలతో మాట్లాడారని తెలిపారు.
వాస్తవాలను చెప్తే కేంద్రమంత్రులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.మెడికల్ కాలేజీలపై కేంద్రమంత్రులు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారన్నారు.
మెడికల్ కళాశాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు.తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.







