ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి.ఇప్పటినుంచే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది.
వైసీపీ, టీడీపి, జనసేన.ఇలా మూడు పార్టీలు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి.175 స్థానాల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో.ఈ నాలుగేళ్లలో అమలుచేసిన పథకాలను, తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరిస్తూ.
జనాల దృష్టి ని ఆకర్షిస్తోంది వైసీపీ.మరోవైపు టీడీపికి కూడా ఈ ఎలక్షన్స్ కీలకం కావడంతో.
ఇవే తనకు చివరి ఎలక్షన్స్ అంటూ సెంటిమెంట్ అస్త్రంతో ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు.
ఇక అటు జనసేన కూడా ఈసారి ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది.
ఇలా మూడు పార్టీలు కూడా ఎలక్షన్ వేడిని ఇప్పటినుంచే పరిచయం చేస్తున్నాయి.ఇదిలా ఉంచితే టీడీపి వైసీపీ లను మాత్రం గతంలో ఇచ్చిన ఒక హామీ వెంటాడుతోంది.
అదే ప్రత్యేక హోదా అంశం.విభజన తరువాత ఆర్థికంగా కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేకహోదా ఒక వరం లాంటిది.
అందుకే రాష్ట్రనికి ప్రత్యేక హోదా కచ్చితంగా కావాలని యావత్ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు.అయితే 2014లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేకహోదా తెస్తామని హామీ ఇచ్చింది.
కానీ అలా జరగలేదు దాంతో చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు.

ఇక 2019 ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని, 25 కు 25 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వొంచుతామని నేటి సిఎం జగన్ ఫైర్ తో హామీ ఇచ్చారు.అనుకున్నట్లుగానే వైసీపీ అధికారం కట్టబెట్టారు ఏపీ ప్రజలు.ఎవరు ఊహించని విధంగా 23 ఏపీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది.

మరి ఇంత భారీ విజయం సాధించినప్పటికి వైసీపీ ప్రత్యేక హోదా తీసుకొచ్చిందా అంటే అది లేదు.ఇక ఆ తరువాత కూడా ప్రత్యేక హోదా కచ్చితంగా తీసుకొస్తామని సిఎం జగన్ పలుమార్లు వ్యాఖ్యానించినప్పటికి.కేంద్రం హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.మరి ఈసారి ఎన్నికల వేళ హోదా అంశం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.అయితే గతంలో హోదాపై ఇచ్చిన హామీని అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరు కూడా నెరవేచలేకపోయారు.మరి ఈసారి ఎన్నికల ముందు హోదాపై ఇరువురు అధినేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.







