విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి హరీశ్ రావు మంత్రి మలారెడ్డి గారి అభిమాని నేను, మంత్రి అంటే ఇష్టం అంటూ హరీశ్ రావు గారి ముందు ఇమిటేట్ చేసిన విద్యార్థి ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది.
విదేశాలకు వెళ్లి చదివేందుకు 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నది.గురుకుల లా కాలేజ్ కూడా వచ్చింది.
ఇన్నోవేషన్ కోసం టి హబ్, వి హబ్ ఉన్నాయి.అక్కడ మీ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుంది.
కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించే అవకాశం ఉంటది.సోషల్ మీడియాలో చాలా వస్తాయి, మనకు అవసరం ఉన్నవి తీసుకోవాలి.
జీవితంలో ఏం కావాలనుకుంటే అది అవుతాం.లక్ష్యం గొప్పగా ఉండాలి.