తెలంగాణ గవర్నర్ పై మంత్రి హరీశ్ రావు ఫైర్

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గవర్నర్ అసెంబ్లీకి పాస్ చేసిన బిల్లులను ఏడు నెలలుగా ఆపారని తెలిపారు.

సుప్రీంకోర్టులో కేసు వేస్తే మూడు బిల్లులను పాస్ చేశారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.రాష్ట్ర ప్రగతిని ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలు గమనించాలని చెప్పారు.

ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని ప్రశ్నించారు.కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే ఏడు నెలలు ఆపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారన్నారు.

తమ పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అని నిలదీశారు.గవర్నర్ చర్యలను, తీరును యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
ఆ విషయంలో మహేష్ ను గౌతమ్ బీట్ చేస్తాడు.. అశోక్ గల్లా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు