ఏపీలో వచ్చే ఎన్నికల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) పోటీ చేస్తారా? లేదా? అన్న సందిగ్ధతకు తెరపడింది.రానున్న ఎన్నికల్లో ఆయన స్వస్థలం గాజువాక( Gajuwaka ) నుంచి బరిలో దిగనున్నారు.
ఈ మేరకు మంత్రి గుడివాడకు వైసీపీ అధిష్టానం గాజువాక బాధ్యతలను అప్పగించింది. సీఎం జగన్( CM YS Jagan ) కు అత్యంత సన్నిహితుల్లో గుడివాడ అమర్నాథ్ ఒకరన్న సంగతి తెలిసిందే.
అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ హైకమాండ్ జనవరిలో అనకాపల్లి( Anakapalli ) నుంచి మంత్రి గుడివాడను తప్పించింది.
ఈ క్రమంలోనే అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్ కుమార్( Malasala Bharat Kumar ) ను నియమించడంతో గత మూడు నెలలుగా మంత్రి గుడివాడ పోటీపై పలు ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి.వీటన్నింటికీ తెర దించుతూ తాజాగా మంత్రి గుడివాడను గాజువాక సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం నియమించింది.కాగా గత డిసెంబర్ లోనే గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్థానంలో వరికూటి చందును నియమించింది.మరోసారి సమన్వయకర్తను మార్పు చేసిన వైసీపీ చందు స్థానంలో మంత్రి గుడివాడను నియమించింది.