ఒక శక్తివంతమైన పార్టీలో ఒకరిద్దరు నాయకులు బయట వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదని… ఒక వ్యక్తి కోసం ఒక లక్ష మంది ప్రజలను బాధపెట్టే రకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోరని అన్నారు.తిరుమల వెళ్లిన మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజా రాజకీయాల పై స్పందించారు.
స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పార్టీ నుంచి కొందరు బయట వెళ్లిపోతున్న తరుణంలో అలాంటి వారి పైన ఘాటుగా మాట్లాడారు.15వ తారీఖున జరిగే క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.మరోసారి వైసిపి అధికారంలోకి, రాబోతుందని పేర్కొన్నారు
.