అమరావతి: మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.దశాబ్ధకాలం పాటు నడుస్తున్న పార్టీ వారేం చెస్తారో చెబుతారనుకున్నాం.
ప్రజలకు ఎలాగూ ఆపార్టీతో ఉపయోగం లేదు.కనీసం కార్యకర్తలకైనా ఉపయోగపడే మాటలు చెబుతాడనుకున్నాం.
ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటే.నెలన్నర నుంచి బంకర్ లో ఉన్న వ్యక్తి బందర్ కు వచ్చాడు.జెండా ఆయనది…అజెండా టీడీపీది.2014లో కొంతమందితో…2019లో కొంతమందితో పొత్తులు పెట్టుకున్నాడు.కులప్రస్తావన లేని సమాజం కోసం పార్టీ పెట్టానన్నారు.కానీ కులాల గురించి ఎంతసేపు మాట్లాడాడో నిన్న చూశాం.కాపులందరినీ చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడమే నీపని.దత్తపుత్రుడనే పదానికి జస్టిఫికేషన్ నిన్నటి సభలో ఇచ్చాడు.
అసెంబ్లీకి రావడానికి ఎన్నికల వరకూ ఎందుకు.స్పీకర్ ను అడిగి మేమే పాసులు ఇప్పిస్తాం.వచ్చి అసెంబ్లీ చూసెళ్లిపోండి.పవన్ కళ్యాణ్ ది కాపు జనసేన కాదు…కమ్మజనసేన.
చంద్రబాబుకు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు పిలుపునిచ్చాడు.ఆంధ్రజ్యోతిలో వెయ్యికోట్ల డీల్ గురించి రాస్తే…అప్పుడెందుకు చెప్పుతీయలేదు.
సొంతమనుషులు అంటే మీకు ఓకేనా…మేం మాట్లాడితే మీకు కోపం వస్తుందా.నిన్నటి మాటలు విని కూడా పవన్ అమ్ముడుపోలేదని ఎవరూ అనుకోరు.
పవన్ వ్యూహాలతో ఆ పార్టీ క్యాడరే అలసిపోయింది.నువ్వు చిరంజీవి తమ్ముడివి కాదా.
చిరంజీవి పెట్టిన పార్టీలో యువరాజ్యానికి అధ్యక్షుడివి నువ్వుకాదా.చిరంజీవి పేరు చెప్పుకోవడానికి కూడా నామోషీగా ఫీలవుతున్నావ్.