ఏపీ టీడీపీ నాయకులపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.జిల్లా అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ఉపాధి కోసం అనేక మంది ప్రజలు దూర ప్రాంతాలకు వలసలు వెళ్లారని అన్నారు.వారి బతుకులు మారడానికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పారు.
సంక్షేమ పథకాలను చంద్రబాబు దుబారా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేద ప్రజలను ఆదుకుంటుంటే అది దుబారా ఎలా అవుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ నేతలకు కనపించవని విమర్శించారు.ప్రజలను మాయ చేసి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు.







